ETV Bharat / city

దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడికి మూడు రోజుల పోలీసు కస్టడీ

దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును మూడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దిశా పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.

దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడికి మూడు రోజుల పోలీసు కస్టడీ
దివ్య తేజస్విని హత్య కేసు నిందితుడికి మూడు రోజుల పోలీసు కస్టడీ
author img

By

Published : Nov 17, 2020, 4:39 AM IST

ప్రస్తుతం నాగేంద్రబాబు అరెస్టై పోలీసులు రిమాండ్​లో ఉన్న విషయం తెలిసిందే. అతనికి విధించిన 14 రోజుల రిమాండ్ ఈనెల 20వ తేదీతో ముగియనుంది. విచారణ అదే రోజు పూర్తి చేసి సాయంత్రం 5 గంటల లోపు కోర్టులో తిరిగి హాజరు పరచనున్నట్లు సమాచారం. అలాగే విచారణలో సేకరించిన సమాచారాన్ని కూడా కోర్టుకు దాఖలు చేసే అవకాశం ఉంది.

గత అక్టోబర్ 15వ తేదీ విజయవాడలోని మాచవరంలో జరిగిన హత్య కేసులో ఇప్పటికే పోలీసులు పలు ఆధారాలను సేకరించారు. ఫోరెన్సిక్ , పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దివ్యతేజస్వినిది హత్యేనని నిర్ధారణకు వచ్చారు. అయితే నిందితుడు మాత్రం తామిద్దరం కలిసి చనిపోదామనుకున్నామని, ఎవరికి వారే గాయాలు చేసుకున్నామని చెబుతున్నాడు. అతను చెప్పే దానికి, క్షేత్రస్థాయిలో లభించిన ఆధారాలకు పొంతన లేదు. అదేవిధంగా హత్య జరిగిన రోజు ఆ గదిలో వారిద్దరి మధ్య ఏం జరిగిందనే విషయంపై పోలీసులకు స్పష్టత లేదు.

ఈ నేపథ్యంలో నాగేంద్రబాబుని కస్టడీలోకి తీసుకుని విచారిస్తేనే ఈ కేసు కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు. దీంతో వారం రోజులు పోలీసు కస్టడీకి కోరుతూ .. ఈనెల 9వ తేదీన దిశ పోలీసుల తరఫున ప్రత్యేక ప్రాసిక్యూటర్ విజయ్ కుమార్ న్యాయస్థానంలో పిటిషన్​ను దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి మూడు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టే ముందు కొన్ని గంటలు నాగేంద్రబాబును విచారించగా.. పోలీసులకు ఈ కేసుకు సంబంధించి పలువురి పేర్లు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే చాలా మందిని విచారించిన పోలీసులు .. మరి కొందరిని విచారించే అవకాశముంది. అలాగే నిందితుడు నాగేంద్రబాబు తనకు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని కోర్టుకు తెలపడంతో.. అతనికి మండల న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించింది.

ఇదీ చదవండి: కోర్టులపై అభ్యంతరకర పోస్టులు... సీబీఐ కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.