ETV Bharat / city

Tidco houses: రిజిస్ట్రేషన్‌ కాగానే టిడ్కో ఇళ్ల అప్పగింత

author img

By

Published : Jun 6, 2022, 8:54 AM IST

Tidco houses: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన గృహాలకు.. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నిర్దేశిత గృహ సముదాయంలో ఉన్న అన్ని గృహాలు పూర్తి చేసి...అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలనుకున్నారు.

distribution of Tidco Houses upon Registration
రిజిస్ట్రేషన్‌ కాగానే టిడ్కో ఇళ్ల అప్పగింత

Tidco houses: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో చేపట్టిన గృహాలకు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే ఎప్పటికప్పుడు లబ్ధిదారులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నిర్దేశిత గృహ సముదాయంలో ఉన్న అన్ని గృహాలు పూర్తి చేసి...అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అందించాలనుకున్నారు. నిర్మాణాల పూర్తికి అవసరమైన నిధుల్ని (రుణ రూపేణా) బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు.

అదిగో ఇస్తాం...ఇదిగో ఇస్తాం అని అధికారులు తేదీలు ప్రకటిస్తున్నారే తప్ప...ఆ గడువు దాటిపోయినా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. తాజాగా జులై నెలాఖరు నాటికి 1.50 లక్షల ఇళ్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం మే నెలాఖరు నాటికి కొన్ని గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినా ఇవ్వలేకపోయారు. దీంతో రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వాటిని ఎక్కడికక్కడ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

మౌలిక సదుపాయాలు ఉంటే అప్పగింత.. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 2.62 లక్షల టిడ్కో గృహాల్లో గత ప్రభుత్వ హయాంలోనే సుమారు 80 వేల ఇళ్లు 90 శాతం మేర పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య లక్షకు చేరింది. గృహ సముదాయాల్లో 1000 మొదలు.. 10 వేల వరకు గృహాలున్నాయి. ఇందులో మూడో వంతు పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.

అంతకన్నా తక్కువ పూర్తయినా... తాగునీరు, విద్యుత్తు సౌకర్యం, సెప్టిక్‌ ట్యాంకు అందుబాటులో ఉంటే అప్పగింతకు మొగ్గుచూపుతున్నారు. ఈ నెల 15వ తేదీలోగా తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం జిల్లా, 15 తర్వాత విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్నింటిని లబ్ధిదారులకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.

29 వేల గృహాలకు రిజిస్ట్రేషన్‌ పూర్తి... టిడ్కో గృహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గతేడాది డిసెంబర్‌ నుంచే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు 29 వేల గృహాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. దీన్ని వేగవంతం చేసేందుకు 11 జిల్లాల పరిధిలోని 15 పురపాలక కేంద్రాల్లో టిడ్కో ఇళ్లకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇక్కడే దాదాపుగా లక్ష గృహాల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 15వ తేదీలోగా వీటి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుగా ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 29 వేల గృహాలను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందినట్లు అధికారులు చెబుతున్నారు.

రుణమిచ్చేందుకు బ్యాంకుల మొరాయింపు.. బ్యాంకుల నుంచి లబ్ధిదారుల వాటాగా టిడ్కోకు అందాల్సిన రుణంలో ఎడతెగని జాప్యం నెలకొంది. రుణాన్ని ఇచ్చేందుకు బ్యాంకులు కొర్రీలు వేస్తున్నాయి. పాలకొల్లులో 800 ఇళ్లు పూర్తయితే అందులో బ్యాంకులు 600 మంది లబ్ధిదారులకే రుణాలిచ్చాయి. లబ్ధిదారుల వాటా అందనిదే రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీల్లేదని అధికారులంటున్నారు.

ఈ కారణంగానే నెల్లూరులో 8 వేల ఇళ్లల్లో 50% మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారు. జులై నెలాఖరు నాటికి లబ్ధిదారులకు ఇవ్వాలనుకుంటున్న 1.50 లక్షల ఇళ్లలో 30వేల గృహాలకు బ్యాంకులు రుణం ఇవ్వకుండా మొరాయిస్తున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.