ETV Bharat / city

ఎల్​వోసీ ఇవ్వండి...విద్యుత్ సరఫరా చేయండి!

రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థలు... లెటర్ ఆఫ్ క్రెడిట్​పై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎల్​వోసీ ఇస్తేనే విద్యుత్ సరఫరా చేయాలన్న నిబంధన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెల్లింపు భద్రత ఉంటేనే విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇక నుంచి సరఫరా చేయనున్నాయి.

Discoms to maintain letter of credit from August 1
author img

By

Published : Jul 29, 2019, 9:12 AM IST

విద్యుత్తు పంపిణీ సంస్థలు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఇవ్వాలంటూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థలు(డిస్కంలు)ఎల్‌సీ ఇస్తేనే విద్యుత్తు సరఫరా చేయాలన్న నిబంధన అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధన ఆగస్టు 1, 2019 నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఉత్పత్తి కంపెనీలకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న జెన్‌కోలకు డిస్కంలు ఇప్పటికే 20 వేల కోట్ల బకాయిలు పడ్డాయి. కొత్త నిబంధన అమల్లోకి వస్తే డిస్కంలు ప్రతి రోజూ తీసుకున్న విద్యుత్తు విలువను నేరుగా బ్యాంకు నుంచి చెల్లించేలా ఏర్పాటు చేయాలి.

వాటిని నిర్ణయించే అధికారాలు రాష్ట్రానికే
బకాయిలను చెల్లించటంలో డిస్కంలు జాప్యం చేస్తే సంబంధిత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను అంగీకరించటానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేయటం లేదు. ఈ మేరకు ఎల్‌సీలను ఇవ్వటం సాధ్యపడదని ఇంధనశాఖ అధికారులు లేఖ రాశారు. వారి నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు ఎల్‌సీల గురించి నిర్ణయించే అధికారాన్ని సంబంధిత రాష్ట్రప్రభుత్వాలకే ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
సరఫరాలో సాంకేతిక నష్టాలు

ఏపీ జెన్‌కో ద్వారా తీసుకున్న విద్యుత్తును ట్రాన్స్‌కో ద్వారా తూర్పు, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలు వాణిజ్య, గృహ, వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు సరఫరా చేస్తున్నాయి. వినియోగించిన విద్యుత్తుకు బిల్లులను వసూలు చేసి తిరిగి జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. కానీ సరఫరాలో సాంకేతిక నష్టాలు విద్యుత్తు చౌర్యం, వినియోగించిన విద్యుత్తుకు బిల్లుల వసూలులో నిర్లక్ష్యం కారణంగా నష్టాలు వస్తున్నాయని డిస్కం అధికారులు చెబుతున్నారు.

నెలనెలా కోట్ల విద్యుత్ కొనుగోలు
దక్షిణ భారత దేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ఎల్‌సీలను ఇచ్చేది లేదని కేంద్రానికి లేఖ రాశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి వచ్చే సమాధానం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. సరఫరా నష్టాలే కారణంఏపీ ట్రాన్స్‌కో అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం ప్రతి నెలా 3 వేల కోట్ల విలువైన విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారు. 450 కోట్ల వడ్డీ భారం ఉంది. సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చుల రూపేణా 400 కోట్లను వెచ్చించాల్సి ఉంది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.