మధుమేహుల్లో శస్త్రచికిత్సల బారినపడే వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. వ్యాధి నియంత్రణలో ఉంచుకోకుంటే ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతుండడం, పుండ్లు త్వరగా మానకపోవటం జరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, గుండె జబ్బులను తగ్గించేందుకు శస్త్రచికిత్సలు అనివార్యం అవుతున్నాయని అంటున్నారు. నియంత్రణలో ఉంచుకోకుండా అత్యవసరంగా శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని హెచ్చరిస్తున్నారు. మధుమేహం తీవ్రత పెరిగే వరకూ సరైన శ్రద్ధ తీసుకోకపోవడం కారణంగా శస్త్రచికిత్స దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.
చాలామందికి ఈ సంగతే తెలియటంలేదు...
మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 50% మంది జీవితంలో ఏదో ఒక శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తోంది. దశాబ్దం కిందట 6% వరకు మాత్రమే ఈ వ్యాధిగ్రస్థులకు శస్త్ర చికిత్సలు జరిగేవి. ప్రస్తుతం 20% దాటింది. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల్లో దాదాపు 50% మందికి... అంటే ఇద్దరు వ్యాధిగ్రస్థుల్లో ఒకరికి... అసలు తమకీ సమస్య వచ్చిందన్న సంగతే తెలియటంలేదు.
సొంత నిర్ణయాలు...
మధుమేహం బారినపడిన వారు కొన్నాళ్లు మందులు బాగానే వేసుకుంటారు. మధ్యలో పరీక్షలు చేయించుకుని గ్లూకోజు అదుపులో ఉందని తేలగానే స్వయంగా నిర్ణయం తీసుకుని మాత్రలు తగ్గిస్తున్నారు. ఆహార నియమాలను గాలికి వదిలేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.
వైద్యులేమంటున్నారంటే...
సాధారణ వ్యక్తులతో పోలిస్తే.. మధుమేహులకు చేసే శస్త్రచికిత్సల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. 24 గంటల నొప్పి, పాదాలకు పుండ్లు వచ్చినప్పుడు ఇన్‌ఫెక్షన్ సోకకుండా వెంటనే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ మధుమేహం అదుపులో లేకుంటే శస్త్రచికిత్సల అనంతరం రోగులు సాధారణ స్థితికి వచ్చేందుకు ఎక్కువ సమయంపడుతుంది. తరచుగా ఇన్‌ఫెక్షన్ల బారినపడుతుండటం, జబ్బులు, పుండ్లు త్వరగా మానకపోవటం, కిడ్నీ, గుండె జబ్బులు రావడం, కంటిచూపు తగ్గటం వంటివి వేధిస్తాయి.
ఇదీ చదవండీ...బొత్స వ్యాఖ్యలపై రాజధాని రైతుల ఆందోళన