విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ కేంద్రంలో.. ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతినిధులు ధర్నా చేశారు. ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడాన్ని తప్పుబట్టారు. విదేశాల్లోనూ బ్రాంచులతో.. విజయవంతగా నడుస్తున్న బ్యాంకును.. యూనియన్ బ్యాంకులో కలపడం ఏంటని ప్రశ్నించారు. పదే పదే తెలుగు వాళ్ల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తున్న కేంద్రం.. ఆంధ్రాబ్యాంకు విషయంలో నిర్ణయం మార్చుకోవాలని సమితి వ్యవస్థాపక సభ్యుడు సుబ్బరాజు విజ్ఞప్తి చేశారు. తెలుగోడి బ్యాంకును చరిత్రలో కలపవద్దని కోరారు.
ఇదీ చూడండి: