రాష్ట్రంలో ఒకేసారి 181 మందికి సీఐలుగా పదోన్నతి కల్పించటం పోలీసు శాఖ చరిత్రలోనే మైలురాయిగా డీజీపీ గౌతమ్ సవాంగ్ అభివర్ణించారు. రూల్ ఆఫ్ లాను పకడ్బందీగా అమలు పరచేందుకు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీస్ శాఖ 24 గంటలూ పనిచేస్తోందని తెలిపారు.
అందుకే పదోన్నతులు..
ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తూ, సరైన సమయంలో పదోన్నతులు లభించకపోవడంతో సిబ్బందికి ఎదురైన ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం.. పదోన్నతులు కల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశమైన హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ను పైలట్ మోడ్‌గా అమలు పరిచే క్రమంలో నిరంతర సమీక్షలు నిర్వహిస్తూ సాంకేతికంగా దేశంలోనే ముందు క్రమంలో ఉన్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి.