ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ ఉంటుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని స్పష్టం చేశారు. అర్చకులు, ఆలయ నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసుశాఖ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రత చర్యలు ఉంటాయన్నారు.
భద్రత చర్యలు పర్యవేక్షించాలని ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఆలయాలకు జియో ట్యాగింగ్, సీసీ కెమెరాల ఏర్పాటును విస్తృతం చేస్తాం. కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
- గౌతమ్ సవాంగ్, డీజీపీ
ఇదీ చదవండి: