విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది. దిల్లీ నుంచి వచ్చిన బృందం ప్రమాద కారణాలను విశ్లేషిస్తోంది. రన్ వే వద్ద మూల మలుపు తిప్పే క్రమంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పొరపాటు వల్లే ప్రమాదం జరినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్యాప్తు వివరాలను పౌరవిమానయాన శాఖకు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి