తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం వల్ల తెల్లవారుజాము నుంచే కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులతో రామయ్య కోవెల కిటకిటలాడింది.
ప్రధానాలయంలోని లక్ష్మణ సమేత సీతారాములకు ఆలయ అర్చకులు పంచామృతాలతో అభిషేకించారు. పౌర్ణమి సందర్భంగా నిత్య కల్యాణ మండపం వద్ద ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.
సీతారాముల కల్యాణ పనులను నేటి నుంచే ప్రారంభించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. తలంబ్రాలు కలిపే వేడుక, పసుకొమ్ములు దంచడం, సీతారాముల డోలోత్సవం, వసంతోస్వం వంటి పలు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నారు. నేడు రామయ్య తండ్రిని పెళ్లికుమారుడిని, సీతమ్మను పెళ్లి కుమార్తెగా తయారు చేయనున్నట్లు పండితులు చెప్పారు.