కొండపల్లి మునిసిపల్ చైర్మన్ ఎన్నికలో తమకు సహకరిస్తే.. కోటి రూపాయలు ఇస్తామని తెదేపా కౌన్సిలర్లకు అధికార పార్టీ నేతలు.. డబ్బు ఆశ చూపారని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కౌన్సిలర్ల కుటుంబసభ్యులపై ఒత్తిళ్లు తెచ్చి బెదిరించారన్నారు. ఆయినప్పటికీ వారు లొంగకుండా అధికార పార్టీ అహంకారానికి తగిన బుద్ధి చెప్పారన్నారు.
అధికారులు కూడా తప్పు చేశారన్న ఉమా.. లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లి ఫలితాలు తారుమారు చేశారని ఆరోపించారు. రీ-పోలింగ్, రీకౌంటింగ్ కోసం న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
వైకాపా సభ్యుల దౌర్జన్యం..
ఎన్నిక వేళ వైకాపా కౌన్సిలర్లు దౌర్జన్యానానికి దిగారని ఉమ అన్నారు. కౌన్సిల్ హాలులో ఉన్న ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత అన్ని విషయాలూ మాట్లాడతానన్నారు. ఎంపీ కేశినాని నాని నిధులు తీసుకువస్తారని.. వాటితో కొండపల్లిని అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: Kondapalli Municipal Chairman Election: ముగిసిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక