విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లో అనారోగ్యంతో బాధపడుతున్న ఐదేళ్ళ పాప పాలిబోయిన వైష్ణవి గురించి తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించారు. దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వైద్య పరీక్షలు నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు.
డివిజన్ పర్యటనలో వారి ప్రాంతానికి వెళ్లినప్పుడు స్థానికుల ద్వారా పాప విషయం తెలిసిందని అన్నారు. పాప వైద్య ఖర్చులు కోసం తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత సరిపోవడం లేదని అందుకే మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం చేశానని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున కూడా వారికి సహాయం అందేలా కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ అవసరం వచ్చిన నిత్యం తాను, తమ నాయకులు అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొంగా రాజ్ కమల్, శేటికం దుర్గాప్రసాద్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి వాడుతూ ఉంటే వాచిపోద్ది... జాగ్రత్త సుమీ!