విశాఖ జిల్లా
చోడవరం దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని రోజుకొక దేవతా మూర్తుల రూపంలో అలంకరణ చేస్తున్నారు. భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సరస్వతి రూపంలో అలంకరణ చేసి పెన్నులు, పూలతో ముస్తాబు చేశారు.
పశ్చిమ గదావరి జిల్లా
తణుకు మండలం మండపాకలో ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ అమ్మవారికి పురాణకాలం నాటి చరిత్ర ఉంది. ఏకవీరాదేవి అంశగా వెలసిన అమ్మవారిని శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున దర్శించుకుంటే విద్యా వినయ సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు. తమను ఉన్నత విద్యావంతులు అయ్యేలా ఆశీర్వదించాలని కోరుతూ.. విద్యార్థినీ విద్యార్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఇదీ చదవండి: