ETV Bharat / city

'రక్షణ, సమగ్ర సమాచారం కోసం వక్ఫ్ బోర్టు ఆస్తుల డిజిటలైజేషన్' - ఏపీ వక్ఫ్ బోర్టు ఆస్తులు

రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్టు ఆస్తుల పరిరక్షణ, సమగ్ర సమాచార లభ్యత దిశగా.. ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా తెలిపారు. ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

deputy cm amjad basha video conference with officials on wakf Board Assets
రక్షణ, సమగ్ర సమాచారం కోసం వక్ఫ్ బోర్టు ఆస్తుల డిజిటలైజేషన్'
author img

By

Published : Oct 6, 2020, 11:18 PM IST

వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ బాధ్యత డీఆర్వోలదేనని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. డీఆర్వోల ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తూ ఉండాలని ఆదేశించారు. ప్రక్షాళనలో భాగంగా ఆక్రమణల నుంచి రక్షణతో పాటు సమగ్ర సమాచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్టు ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తున్నట్లు వివరించారు. సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆదాయం తగ్గింది...

బోర్డుకు సంబంధించిన వేలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయన్నాని మంత్రి వ్యాఖ్యానించారు. అదే సమయంలో కమర్షియల్ భూములు, భవనాలకు అద్దె రూపంలో వచ్చే ఆదాయం తక్కువగా ఉంటోందని అన్నారు. వివాదంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములకు సంబంధించిన వివరాలను జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం.
తక్షణమే స్వాధీనం..
వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు, అవి ఏయే దశల్లో ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలను తక్షణమే జిల్లాల వారీగా అందించాలని డీఆర్వోలను ఆదేశించారు. కోర్టులతో సంబంధం లేకుండా ఆక్రమణలో భూములను గుర్తించి, వాటిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలన్నారు. స్వాధీనం చేసుకున్న భూములను అభివృద్ధి చేయడానికి, ఆదాయ మార్గాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలని చెప్పారు. ఆదాయం పెంపుదలకు రెంట్స్ రెవెన్యూ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.