ETV Bharat / city

బ్యాంక్ అధికారులమంటూ నగదు దోచేస్తున్నారు... - కేవైసీ అప్​డేట్ పేరిట విజయవాడలో పెరుగుతున్న సైబర్ నేరాలు

హాలో మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ ఖాతాను అప్ డేట్ చేయాలి.. వివరాలు తెలపండి అంటూ మొదలు పెడతారు. ఆపై మీ ఫోన్​కి సంక్షిప్త సమాచారం వస్తుంది.. మాకు పంపండంటూ నగదు కాజేస్తారు. జార్ఖండ్, బీహార్, పశ్చిమ బంగ కేంద్రంగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

cyber frauds
సైబర్ మోసాలు
author img

By

Published : Dec 21, 2020, 8:58 AM IST

బ్యాంక్ అధికారులమంటూ నగదు దోచేస్తున్న సైబర్ మోసగాళ్లు

బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ నమ్మించి.. కేవైసీ పేరుతో నగదు దోచుకునే ముఠాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. విజయవాడలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వ్యక్తికి మొదట వాట్సాప్ ద్వారా ఆర్​బీఎల్ బ్యాంకు నుంచి కేవైసీ అప్​డేట్​ చేయమని సంక్షిప్త సమాచారం వచ్చింది. అందులో చెప్పిన విధంగానే అతడు చేశాడు. తర్వాత రోజు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. వివరాలు నమోదు కాలేదని చెప్పాడు. బయోమెట్రిక్​ చేయాలని చెప్పగా అదీ చేశాడు. తర్వాత రోజు మళ్లీ ఫోన్​ చేసిన ఆ వ్యక్తి... మీ కార్డు వివరాలు సరిచేయాలి, మీ ఫోన్​కి సంక్షిప్త సందేశాలొస్తాయి.. అందులో ఉన్న వివరాలు చెప్పండని కోరాడు.

కొద్దిసేపటి తర్వాత సందేశాలు రాగానే కోడ్ చెప్పమన్నాడు. ఆ కోడ్ సంఖ్యల రూపంలో కాకుండా అక్షరాలుగా ఉన్నాయి. ఫోన్​ చేసిన వ్యక్తి నెంబరు ట్రూకాలర్​లో ఆర్​బీఎల్ బ్యాంకు అని ఉండటంతో నమ్మి బాధితుడు వివరాలు చెప్పాడు. వాటిని చెప్పగానే బ్యాంకు ఖాతాల్లోంచి 40 వేల నగదు మాయమయ్యింది. ఈ విషయం చెప్పేలోపు ఫోన్​ కట్ చేశాడు. లబోదిబోమంటూ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పశ్చిమ బంగ, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో క్రెడిట్ కార్డ్ ముఠాలు మకాం వేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఠా సభ్యులు వివిధ బ్యాంక్​ల ఖాతాదారుల ఏటీఎం కార్డుల నంబర్లు, పేర్లు, వివరాలను దిల్లీ, ముంబయిలలో పొరుగు సేవల సిబ్బంది ద్వారా సేకరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు.

కొత్త సిమ్​కార్డులు తీసుకుని డెబిట్​కార్డుదారులకు ఫోన్​చేస్తున్నారు. పేరు, చిరునామా, వయసు సహా వివరాల్ని సరిగ్గా చెబుతున్నందున నిజంగా బ్యాంకు ప్రతినిధులే అని కార్డుదారులు నమ్మేస్తున్నారు. ఫోన్ చేసి ఓటీపీ తీసుకుని ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. ప్రతి కార్డుకు సాధారణంగానే బీమా సదుపాయం ఉంటుంది. తన ప్రమేయం లేకుండానే లావాదేవీ జరిగినట్లు బాధితుడే రుజువు చేసుకోవాలి. అలా చేస్తే మోసపోయిన డబ్బును సులభంగానే తిరిగి రాబట్టే వీలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

వందేళ్ల తర్వాత రాష్ట్రంలో భూముల సర్వే..నేడు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.