తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న కేసుకు సంబంధించిన సమాచారం సేకరణలో భాగంగా సైబర్ క్రైం పోలీసులు గత శనివారం తెదేపా కార్యలయ కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టింది ఎవరు? ఆ పేజీకి అడ్మిన్ ఎవరు? తదితర విషయాల గురించి మూడు రోజుల్లో సమాచారం అందించాలని కోరారు. అయితే దీనిపై తెదేపా కార్యాలయ కార్యదర్శి నుంచి సమాధానం రాకపోవటంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. కేసు విచారణలో భాగంగా వైకాపా అభ్యర్థి గురుమూర్తి నుంచి కూడా వివరాలు తీసుకునేందుకు సైబర్ క్రైం అధికారులు సిద్ధమవుతున్నారు.
ఇదీ చదవండి: ఆస్పత్రి మెట్ల వద్ద.. భార్య ఒడిలోనే కరోనా రోగి మృతి