సైబర్ నేరస్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కస్టమర్ కేర్ పేరుతో బ్యాంక్ ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నారు. విజయవాడకు చెందిన ఓ యువతి తన స్నేహితురాలికి గూగుల్ పే ద్వారా 5 వేల రూపాయల నగదును బదిలీ చేసింది. నగదు బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయినట్లు వచ్చింది. అయితే ఆ నగదు స్నేహితురాలి ఖాతాకు వెళ్లలేదు. స్నేహితులు కొద్దిరోజుల్లో తిరిగి ఖాతాలో జమ అవుతాయని తెలిపింది. దీంతో వారం రోజులు నిరీక్షించినా.. నగదు జమ కాలేదు.
దీంతో ఆన్ లైన్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి ఫోన్ చేసింది. సాంకేతిక సమస్యతో ఇలా అవుతుందని నగదు జమ అవుతాయని ముందుగా గూగుల్ పే యాప్ లోకి వెళ్లాలని తెలిపారు. బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకున్నారు. ఒక కోడ్ వస్తుందని ఆకోడ్ చెపితే నగదు ఖాతాలో జమ అవుతాయని నమ్మించారు. ఆనెంబర్ చెప్పగానే ఖాతాలో 48 ,761 రూపాయల నగదు మాయమైంది. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ ఇన్స్ పెక్టర్ శివాజీకి ఫిర్యాదు చేసింది. గంట వ్యవధిలోనే పోలీసులు నిందితుడి ఖాతాలోని నగదును సీజ్ చేసి.. బాధితురాలికి అందజేశారు.
ఇదీ చదవండి: అన్లాక్ 3.0: సినిమా హాళ్లకు నో- యోగా కేంద్రాలకు ఓకే