గుర్తింపు లేని ఫైనాన్స్ కంపెనీల మోసాలపై తక్షణం విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాథ్ దాస్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సీఎస్ అధ్యక్షతన నిర్వహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో అగ్రిగోల్డ్ సహా వివిధ ఆర్థిక మోసాలు, ఆన్లైన్ రుణ కంపెనీల మోసాలపై చర్చించారు. ఆర్థిక మోసాల నియంత్రణకు సంబంధించి కార్యాచరణ రూపొందించాల్సిందిగా సీఐడీ అధికారులను సీఎస్ ఆదేశించారు.
గుర్తింపు లేని ఫైనాన్స్ కంపెనీల మోసాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కమిటీ అభిప్రాయపడింది. మరోవైపు అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆ సంస్థకు చెందిన రూ.7 వేల కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసినట్లుగా సీఐడీలోని ఆర్థిక నేరాల విభాగం సీఎస్‌కు నివేదించింది. పది వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితుల సంఖ్య 3.69 లక్షలుగా ఉందని వీరికి ఇప్పటి వరకూ రూ. 239 కోట్లు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీచదవండి: ఎమ్మెల్సీ విజేత కల్పలతారెడ్డిని అభినందించిన సీఎం జగన్