Crocodile in moosi river: వరదలో కొట్టుకొచ్చిన మొసలి... భయాందోళనలో స్థానికులు - Crocodile in moosi river
హైదరాబాద్‌లోని అత్తాపూర్ వద్ద మూసీలో మొసలి(Crocodile in moosi river) కలకలం రేపింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ వరదలో మొసలి కొట్టుకువచ్చింది. మొసలిని గమనించిన స్థానికులు.. జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు.. సూచిక బోర్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో కిస్మత్‌పూర్ శివారులోనూ 2 మొసళ్ల కళేబరాలను అధికారులు గుర్తించారు.