ETV Bharat / city

Crime Rate Increase in State: రాష్ట్రంలో పెరుగుతున్న చోరీలు, దోపిడీలు.. 2021లో 15.37 శాతం ఎక్కువ - 2021లో 15.37 శాతం మేర పెరిగిన చోరీలు, దోపిడీలు

Crime Rate in AP: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. సగటున రోజుకు 41 చోరీలు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలు, ఇళ్ల లూటీల వంటి నేరాలకు తెగబడుతున్నారు. 2020తో పోలిస్తే 2021 జనవరి నుంచి నవంబరు వరకు ఈ తరహా నేరాలు 15.37 శాతం మేర పెరిగాయి. రోజుకు సగటున రూ.15.59 లక్షల సొత్తును దొంగల పాలవుతుంది.

Crime Rate Increase in State
Crime Rate Increase in State
author img

By

Published : Jan 3, 2022, 4:37 AM IST

Crime Rate Increased in 2021 at AP State: రాష్ట్రంలో చోరీలు, దోపిడీలు, ఇళ్ల లూటీలు.. రోజురోజుకు పెరుగుతున్నాయి. సగటున రోజుకు 41 చోరీలు, దోపిడీలు జరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే రోజుకు సగటున రూ.15.59 లక్షల సొత్తును దొంగల పాలవుతుంది. 2020తో పోలిస్తే 2021 జనవరి నుంచి నవంబరు వరకు ఈ తరహా నేరాలు 15.37 శాతం మేర పెరిగాయి. నిరుడు తొలి 11 నెలల వ్యవధిలో రాష్ట్రంలో 1,27,127 కేసులు నమోదు కాగా.. అందులో 10.98 శాతం ఘటనలు చోరీలు, బందిపోటు దొంగతనాలు, దోపిడీలు, ఇల్లు కొల్లగొట్టడాలు, లాభం కోసం హత్యల వంటి సంఘటనలే. ఆర్థిక సంబంధమైన నేరాలుగా (ప్రాపర్టీ అఫెన్సెస్‌) పరిగణించే వీటిల్లో 73.67 శాతం చోరీలే ఉన్నాయి.

రోజుకు రూ.15.59 లక్షల సొత్తు దొంగల పాలు

  • మొత్తం 18 పోలీసు యూనిట్లకుగాను రాజమహేంద్రవరం అర్బన్‌, విశాఖపట్నం సిటీ, పశ్చిమగోదావరి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, విజయనగరం జిల్లాల పరిధిలో రూ.56.91 కోట్ల విలువైన సొమ్ము పోయింది. అంటే రోజుకు సగటున రూ.15.59 లక్షల సొత్తును దొంగలు దోచుకున్నారు.

  • విశాఖ నగరంలో రోజుకు సగటున రూ.1,77,808 విలువ గల సొత్తును దొంగలు దోచుకున్నారు.
  • విజయనగరం జిల్లాలో 2020లో జరిగిన దొంగతనాల్లో రూ.1.34 కోట్ల విలువైన సొత్తు పోగా, 2021లో రూ.2.07 కోట్ల సొత్తు పోయింది.

పోయిన సొత్తూ ఎక్కువే..

విజయనగరం, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి, విశాఖ నగరం, రాజమహేంద్రవరం అర్బన్‌ తదితర యూనిట్ల పరిధిలో 2020లో పోయిన సొత్తు కంటే 2021లో పోయిన సొత్తు ఎక్కువ. చిత్తూరులో 2021లో అత్యధికంగా రూ.10.06 కోట్లు, నెల్లూరులో రూ.9.94 కోట్లు, ప్రకాశంలో రూ.9.36 కోట్లు, పశ్చిమగోదావరిలో రూ.9.22 కోట్ల విలువైన సొత్తు పోయింది.

.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.