CHALO VIJAYAWADA POSTPONED సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం వాయిదా పడింది. రాష్ట్రంలో తమకు ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేసుకోవాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఎక్కడికక్కడ నిరనసలు, ఆందోళనలు కొనసాగుతాయని ఏపీసీపీఎస్ఈఏ స్పష్టం చేసింది. పోలీసులు, ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నామని.. సెప్టెంబర్ 1కి బదులుగా అదే నెల 11న చలో విజయవాడ నిర్వహించాలని నిర్ణయించనున్నట్లు నేతలు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులను ఎక్కడికక్కడ బైండోవర్ చేస్తుండటంతో పాటు నోటీసులు జారీ చేయడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు సెప్టెంబరు ఒకటో తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గోనేందుకు వచ్చే సీపీఎస్ ఉద్యోగులకు ఎక్కడా ఆహారం దొరక్కుండా టిఫిన్ సెంటర్లు, భోజన హోటళ్లను కూడా మూసివేయాలంటూ పోలీసులు అనధికారికంగా హుకుం జారీ చేశారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: