ETV Bharat / city

CPM Protest in Dharnachowk: విజయవాడ ధర్నాచౌక్‌లో ప్రారంభమైన సీపీఎం నిరాహారదీక్ష - cpm leader srinivas comments on central

cpm protest: విజయవాడ ధర్నాచౌక్‌లో ఉదయం 10గంటలకు సీపీఎం నిరాహారదీక్షప్రారంభమయ్యింది. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు, రాజధాని నిర్మాణానికి మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులివ్వాలని డిమాండ్‌ చేశారు.కేంద్ర బడ్జెట్‌లో రాజధానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ దీక్షలో పలువురు నేతలు పాల్గొన్నారు.

CPM Protest in Dharnachowk
సీపీఎం నిరాహారదీక్ష
author img

By

Published : Feb 9, 2022, 10:35 AM IST

Updated : Feb 9, 2022, 12:31 PM IST

cpm protest in vijayawada: అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజయవాడ ధర్నాచౌక్‌లో ఇవాళ సీపీఎం నిరాహారదీక్ష చేపట్టింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష జరగనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టబద్ధ హమీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణా మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులివ్వాలని, అమరావతి రైలు ప్రాజెక్టుకు కేంద్రం కేటాయింపులు చేయాలని స్పష్టం చేశారు.

రాజధానిని అమరావతిలోనే ఉంచాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర బడ్జెట్​లో అమరావతి రాజధానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బడ్జెట్​ను రివైజ్ చేసి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రధాని చీకట్లో విభజన జరిగింది అని అంటున్నారు, మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి ఊరికే మాట్లాడ్డం కాదు అని అందరిని కలుపుకుని దిల్లీ తీసుకువెళ్లాలని సూచించారు. అమరావతిగా రాజధానిని ఇక్కడే కొనసాగించి అభివృద్ధి చేయాలని కోరారు.

రాజధాని అమరావతిలో తట్టెడు మట్టి సైతం ఇప్పటి ప్రభుత్వం వెయ్యలేదని సీపీఎం నేత బాబురావు విమర్శించారు. విభజన పాపంలో భాజపా పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ దీక్షలో సీహెచ్‌ బాబూరావు, పువ్వాడ సుధాకర్‌, అమరావతి రైతులు, రైతు సంఘ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'జూన్ 30లోగా కోర్టు భవనాన్ని అప్పగిస్తాం'.. నివేదించిన ప్రభుత్వం

Last Updated : Feb 9, 2022, 12:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.