ETV Bharat / city

CPM: 'అమరావతి ప్రజాబాట కార్యక్రమం అందుకే'- సీపీఎం

author img

By

Published : Mar 13, 2022, 8:07 PM IST

CPM: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం పేరుతో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు తెలిపారు. ఈనెల 21న చలో తుళ్లూరు‌ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.

cpm party state executive commite member baburao
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ప్రజాబాట కార్యక్రమం

CPM: రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో "ప్రజాబాట" కార్యక్రమం పేరుతో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు యాత్ర నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబురావు తెలిపారు. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు వ్యాఖ్యానించారు.

ఈనెల 21న చలో తుళ్లూరు‌ కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరావతి రాజధానిని నిర్లక్ష్యం చేస్తూ ప్రజలను, రైతులను దగా చేస్తూ పరిపాలన చేయడం చాలా దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని వివాదానికి ఇకనైనా స్వస్తి పలికి, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు.

ఇదీ చదవండి: Polavaram works: పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.