రాజమహేంద్రవరం నుంచి సీపీఐ రాష్ట్ర బృందం పోలవరానికి బయల్దేరింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో బయల్దేరిన బృందం.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. నవంబర్‌లో పోలవరం ప్రాజెక్టు సందర్శనను ప్రభుత్వం అడ్డుకుందని రామకృష్ణ తెలిపారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలని ఆయన కోరారు.
దివిస్ పరిశ్రమపై హామిపై మండిపాటు
సీఎం జగన్ గతంలో దివిస్ పరిశ్రమపై గతంలో ఇచ్చిన హామీకి భిన్నంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడిన 36 మందిని 18 రోజులుగా జైల్లో పెట్టారని ఆగ్రహించారు. దివిస్ అంశంపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి:
ఉద్రిక్తంగా 'చలో రామతీర్థం'.. భాజపా, జనసేన నేతల గృహ నిర్బంధం