పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల కష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్రం నిధులు ఇవ్వాలన్నారు.
భాజపా, వైకాపా నేతలు ఒకరిపై ఒకరు ఆరోపించుకోవటం కాదని.. పోలవరం పరిధిలో ఉన్న ప్రజల జీవితాలను కాపాడాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. నిర్వాసితులతో జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడరా అని నిలదీశారు. చంద్రబాబు, జగన్ హయాంలో ఎవరెన్ని అప్పులు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 16వ తేదీ నుంచి ప్రత్యక్ష ఆందోళన చేస్తామన్నారు.
ఇదీ చదవండి:
కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌తో ఏపీ నీటిసంఘాల ప్రతినిధుల భేటీ
polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!