CPI Rama Krishna on Cultivation laws : సాగు చట్టాలు మళ్లీ తీసుకు వస్తామన్న కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి తోమర్ వ్యాఖ్యాలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. ప్రధాని మోదీ హయాంలోనే రైతులకు మేలు జరిగితే.. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు.
750 మంది అన్నదాతలను పొట్టనపెట్టుకున్నది భాజపా ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తే మరో రైతు ఉద్యమం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.
ఇదీ చదవండి : Farm Laws repealed: మళ్లీ తెరపైకి సాగు చట్టాలు- కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు