రాష్ట్రం విడిపోయాక రాజధానిపై మొదట మాట్లాడింది తమ పార్టీయేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజధాని ఉండాలని ప్రతిపాదించింది తామేనని విజయవాడలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన స్పష్టం చేశారు. వైకాపాలోనూ చాలామంది అమరావతికి అనుకూలమేనని.. నార్కో టెస్ట్ నిర్వహిస్తే జగన్ తప్ప అందరూ అమరావతికి అనుకూలంగా మాట్లాడతారని వ్యాఖ్యానించారు. జగన్‌ది ఫ్యాక్షనిస్టు ఆలోచనా ధోరణని విమర్శించారు. ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని.. వాస్తవానికి, అవాస్తవానికి జరుగుతున్న పోరాటంలో అమరావతి గెలుస్తుందని ఉద్ఘాటించారు.
ఇవీ చదవండి.. 'విశాఖ పోలీసులకున్న మంచిపేరుపై మచ్చపడేలా చేశారు'