ETV Bharat / city

ప్రధాని ఉపన్యాసం హరికథలా ఉంది: సీపీఐ నారాయణ - సీపీఐ నారాయణ వార్తలు

కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పని చేయాల్సిన ప్రభుత్వాలు.. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన ఉపన్యాసం హరికథల తరహాలో అందర్నీ ఆకట్టుకుందని ఎద్దేవా చేశారు.

CPI Narayana
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
author img

By

Published : Aug 15, 2021, 7:03 PM IST

కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పని చేయాల్సిన ప్రభుత్వాలు.. వారికి దాసోహమంటున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు.ఎంతోమంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

కొవిడ్ సమయంలోనే అదానీ, అంబానీలు వందల కోట్లు సంపాదించుకుంటే.. పేదలు మాత్రం తిండి కూడా దొరకక పస్తులతో అల్లాడుతున్నారన్నరని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. అయినా ప్రజల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఈరోజు ఇచ్చిన ఉపన్యాసం హరికథల తరహాలో అందర్నీ ఆకట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగాలు మాటలకే పరిమితం తప్ప.. చేతలు ఉండవని అన్నారు.

ఇదీ చదవండి:

'నవ భారత్​ కోసం రూ.100 లక్షల కోట్లతో ప్రగతి యజ్ఞం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.