సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి. తన మాట తీరుతో పదునైన విమర్శలతో ఆకట్టుకునే వారు. జాతీయ కార్యదర్శిగా వెళ్లాక ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన అప్పుడప్పుడు మాత్రమే మెరుస్తున్నారు. అయితే... రెండు రోజుల కిందట సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆయన ఫోటో ఒకటి బాగా ఆకట్టుకుంటోంది. మెడలో గిటార్ వేసుకొని రాక్ స్టార్ లా కనిపిస్తున్న నారాయణ చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. రెండు రోజుల కిందట ఫేస్బుక్లో ఈ ఫొటో పోస్ట్ చేశారు. నారాయణగారి లో ఎన్ని కళలు ఉన్నాయో అంటూ పార్టీ నేతలు, సన్నిహితులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదీ చదవండి: