విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టేందుకు తనకు అనుమతిని ఇవ్వాలంటూ విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును వైకాపా ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కోరారు. ఇప్పటికే ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకున్నారని సీపీ తెలిపారు. రెండు ప్రధాన పార్టీల నేతలు ఒకే ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు తాము అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఒకే ప్రాంతంలో ధర్నా చేపడితే శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని..అందుకే ఎమ్మెల్యే పార్థసారధి చేపడుతున్న నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు వివరించారు. వేరే ప్రాంతంలో నిరసన చేపట్టేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు చేయనున్న దీక్షకు పూర్తి స్థాయి భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: