కరోనా వ్యాక్సినేషన్ రెండో డోసు కోసం ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో వృద్ధులు క్యూలైన్లో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలు టీకా వేస్తారో లేదో తెలియక అయోమయంలో పడ్డారు. సాంకేతక కారణాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ అలస్యమవుతుందని.., 5-6 గంటలు నిరీక్షించాల్సి వచ్చిందని వృద్ధులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని వేడుకుంటున్నారు.
ఇదీచదవండి