ETV Bharat / city

మహిళా మృతి... పరీక్షల్లో కరోనా పాజిటివ్​

అనారోగ్యంతో ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించిన ఇద్దరు పోలీస్​ సిబ్బందికి సమస్య ఎదురైంది. అష్ట కష్టాలు పడి సొంత కారులో ఆసుపత్రికి చేర్చినా... అప్పటికే మహిళా మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసు సిబ్బందిని విజయవాడ సీపీ ఆదేశాల మేరకు హోం క్వారంటైన్​కు పంపించారు.

మహిళా మృతి... పరీక్షల్లో కరోనా పాజిటివ్​
మహిళా మృతి... పరీక్షల్లో కరోనా పాజిటివ్​
author img

By

Published : Apr 23, 2020, 8:14 AM IST

అనారోగ్యంతో మృతిచెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ నిర్థరణ కావటంతో ఆమెకు సాయం చేసిన ఇద్దరు పోలీసులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఈనెల 19న అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దనే మందులు వేసుకున్నారు. అనంతరం 20న తెల్లవారుజామున దిశ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చింది. అక్కడ ఓపీ లేదని.... ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సిబ్బంది తెలిపారు. అక్కడి నుంచి వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న ఆమెను... దిశ పోలీస్​ స్టేషన్ ఎస్​ఐ తన సొంత కారులో సైబర్ క్రైం నిపుణుడితో కలిసి గుణదలలోని ఈఎస్​ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం ఆమె మృతదేహానికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా తేలింది. ఈ నేపథ్యంలో ఆమెతో కలిసి ఉన్నవారందరినీ హోం క్వారంటైన్‌కు తరలించగా... మహిళకు సాయం చేసిన ఎస్​ఐతో పాటు సైబర్ క్రైం నిపుణుడిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించారు. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

ఇదీ చూడండి: యలమంచిలిలో నాలుగో విడత ఇంటింటి సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.