తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో ఒకే కుటుంబంలోని 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మదీనాగూడ ప్రైవేట్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నారు. 14 మందికి పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్, ఇద్దరికి నెగెటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ సుజాత తెలిపారు. వారిని స్వీయ నిర్బంధంలోనే ఉండాలని బాధితులకు చెప్పామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. బాధితులు ఉండే వీధిని శానిటైజేషన్ చేశామని మున్సిపల్ కమిషనర్ వెల్లడించారు.
ఇదీ చూడండి: