గత 24 గంటల్లో రాష్ట్రంలో 56,409 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 355 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 354 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. కృష్ణాలో ఒకరు..,గుంటూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారని వెల్లడించింది.
చిత్తూరులో అత్యధికంగా 81 మంది, విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 6 మందికి కరోనా నిర్ధారణ జరిగిందని తెలిపింది. గుంటూరు 53, తూర్పుగోదావరి 49, కృష్ణా 43, విశాఖ 28, నెల్లూరు 24, అనంతపురం 15, శ్రీకాకుళం, ప్రకాశం, కడప, కర్నూలులో 12 చొప్పున, పశ్చిమగోదావరి జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 6 కరోనా కేసులు కొత్త కేసులు నమోదైనట్లు పేర్కొంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఒక కోటి 15 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,80,430 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 8.69 లక్షల మంది పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరో 3,861 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహమ్మారి ధాటికి 7,091 మంది మరణించారు.
ఇదీచదవండి