ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగుల్లో కరోనా భయం.. బయటపడేదెలా?

ఆంధ్రప్రదేశ్ సచివాలయం కరోనా వైరస్​కు హాట్ స్పాట్​గా మారింది. ఇప్పటి వరకూ నలుగురు సచివాలయ ఉద్యోగులు కరోనా వైరస్​తో మరణించారు. నలభై మందికి పైగా.. ఈ వైరస్​తో బాధపడుతున్నారు. ఇద్దరు హైకోర్టు ఉద్యోగులు కరోనాతో మరణించడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన మెుదలైంది.

corona effect on govt employees
corona effect on govt employees
author img

By

Published : Apr 19, 2021, 7:23 PM IST

Updated : Apr 19, 2021, 8:07 PM IST

కరోనా మలిదశ ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని తీవ్రంగా భయపెడుతోంది. కరోనా కారణంగా ఏపీ సచివాలయంలో మూడు రోజుల్లోనే నలుగురు మృతి చెందటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తక్షణం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలంటూ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో ఇద్దరు, రాష్ట్రవ్యాప్తంగా మరో 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మృతి చెందటంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కారణంగా ఉద్యోగులు రాకపోవటంతో సచివాలయం ఖాళీగా మారింది.

కుటుంబ సభ్యుల్లోనూ..

ఏపీలో కరోనా మలిదశ తారాస్థాయికి చేరుతోంది. వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతుండటంతో పాటు మరణాలు కూడా గరిష్ట స్థాయిలోనే నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి కరోనా తీవ్రతపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ సచివాలయంలో మూడు రోజుల వ్యవధిలోనే నలుగురు ఉద్యోగులు కరోనా కారణంగా మృతి చెందటంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ‌ స‌భ్యుల‌కు కూడా కరోనా సోకుతుండ‌టంతో ఉద్యోగుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

హాట్​స్పాట్​గా సచివాలయం

ఇప్పటికే స‌చివాల‌యంలో ప‌ని చేస్తున్న సుమారు 40 నుంచి 50 మంది ఉద్యోగుల‌కు క‌రోనా సోకింది. వ‌రుస‌గా మూడు రోజుల్లో న‌లుగురు స‌చివాల‌య ఉద్యోగులు క‌రోనా తో మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న వి.పద్మారావు కరోనాతో మృతి చెందారు. పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ఆయన సతీమణి శాంత కుమారి ఇవాళ కరోనాతో కన్నుమూశారు. అటు హోం శాఖ‌లో రికార్డ్ అసిస్టెంటుగా పని చేస్తున్న ఏఎస్ఎన్ మూర్తి కూడా కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ అధికారిగా ప‌నిచేస్తున్న జి. రవికాంత్ కూడా క‌రోనాతో మృతి చెందారు. దీంతో స‌చివాల‌య ఉద్యోగుల్లో ఒక్కసారిగా భయాందోళనలు కమ్ముకున్నాయి. స‌చివాల‌యంతో పాటు ఏపీ హైకోర్ట్ లో ప‌ని చేస్తున్న శ్రీ‌ల‌త‌, సుబ్రమ‌ణ్యం కూడా ఇవాళ క‌రోనాతో మృతి చెందారు. తక్షణం తమకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాలంటూ ఉద్యోగులు ప్రభుత్వానికి నివేదించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ డిమాండ్

ప్రభుత్వ ఉద్యోగుల‌తో పాటు వారి కుటుంబ‌ స‌భ్యులకు కూడా క‌రోనా సోకుతుండ‌టంతో ఉద్యోగుల్లో ఆందోళ మ‌రింత పెరిగింది. స‌చివాల‌యంలో ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ఆదిత్యనాథ్ దాస్ స‌హ కీల‌క శాఖ‌ల ఉన్నతాధికారుల్లో ప‌లువురికి కూడా క‌రోనా సోకింది. స‌చివాల‌యంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో సీనియ‌ర్ ఆధికారులు, మంత్రులు సైతం స‌చివాల‌యానికి రావడం లేదు. ఈ కారణంగా సచివాలయం అంతా ఉద్యోగుల్లేక ఖాళీగా మారిపోయింది. కరోనా కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని.. ఉద్యోగులు భావోద్వేగానికి లోనవుతున్నారు. కరోనాకు మరో ఉద్యోగి ప్రాణాలు కోల్పోక ముందే వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ పరిణామాలను దృష్టి పెట్టుకుని.. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు రేపటి నుంచి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని.. ఈ ఏడాది విద్యా సంవత్సరం పూర్తయినట్లు తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారమే పది, ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపింది.

మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కరోనా వైద్య సౌకర్యాలు పెంచాలని పౌరహక్కుల సంఘం పిటిషన్ వేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలని కోరింది. కొవిడ్ పరీక్షలు నిర్వహించడంలోనూ, పాజిటివ్​గా తేలినవారికి అవసరమైన వైద్య సౌకర్యాలు కల్పించడంలోనూ ప్రభుత్వ చర్యలు సరిగా లేవని.. ఏపీ పౌర హక్కుల సంఘం పిటిషన్​లో పేర్కొంది.

ఇదీ చదవండి: కరోనా కట్టడిపై హైకోర్టులో పిటిషన్‌

Last Updated : Apr 19, 2021, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.