ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: కొనుగోళ్లు లేక.. పుస్తక దుకాణాల విలవిల

విద్యాసంవత్సరం ప్రారంభమైతే చాలు పుస్తకాల దుకాణాలు కిటకిటలాడతాయి. పరీక్షల సీజన్ మొదలయ్యే మార్చి నుంచి జులై నెలాఖరు వరకు పుస్తకాలు, పెన్నులు, అట్టలు వంటివి కొనడంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తలమునకలవుతారు. సంవత్సరం మొత్తంలో 90 శాతం వ్యాపారం మే, జూన్, జులై నెలల్లోనే జరుగుతుంది. అలాంటిదిప్పుడు కరోనా కారణంగా వ్యాపారమే లేదు. విద్యాసంస్థలు తెరుచుకోక విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. వెరసి పుస్తకాల దుకాణాలు వెలవెలబోతున్నాయి. కొవిడ్ కారణంగా నష్టాలు చూస్తున్న బుక్ షాప్స్​లపై ప్రత్యేక కథనం.

corona effect on book shops
పుస్తక దుకాణాలపై కరోనా ప్రభావం
author img

By

Published : Jul 15, 2020, 9:40 AM IST

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైందంటే చాలు.. విద్యార్థులు, తల్లిదండ్రులు పుస్తకాల దుకాణాల ముందు క్యూ కడతారు. ఎన్ని బుక్స్ కొనాలి, వాటికి ఎలాంటి అట్టలు వేయాలి, ఎలాంటి స్టిక్కర్లు కొంటే పిల్లలను ఆకట్టుకుంటాయి... అంటూ పుస్తకాల దుకాణాలకు పరుగులు తీస్తారు. పుస్తకాలు కొని, వాటికి అట్టలు వేసి పిల్లలతోపాటు తామూ మురిసిపోతుంటారు. ఒక్క బుక్స్ అనే కాదు పెన్నులు, పెన్సిళ్లు, ప్యాడ్​లు, జామంట్రీ బాక్సులు ఇలా ఎన్నింటినో కొనే విద్యార్థులు, తల్లిదండ్రులతో పుస్తకాల షాపులు కళకళలాడుతుంటాయి.

  • కొనుగోళ్లు లేవు

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఆ సందడే కనిపించడంలేదు. వైరస్ విజృంభణతో మూతపడిన విద్యాసంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. దీంతో విద్యార్థులకు పుస్తకాల అవసరం లేకుండా పోయింది. చాలా పాఠశాలలు, కళాశాలలు ఆన్ లైన్ బోధనకు తెరతీసినా.. పుస్తకాలు, పెన్నుల కొనుగోళ్లు ఏమంత ఆశాజనకంగా లేవని దుకాణదారులు చెప్తున్నారు. కరోనా కారణంగా ఏడాది మొత్తంలో 90 శాతం వ్యాపారం జరిగే సీజన్​ను నష్టపోయామని బోరుమంటున్నారు.

  • అప్పుడు కోటిన్నర.. ఇప్పుడు లక్ష

కొవిడ్ కారణంగా పుస్తకాలు, అనుబంధ వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. విజయవాడ నగరంలోనే వందకు పైగా పుస్తక దుకాణాలున్నాయి. అన్ని తరగతులకు అవసరమయ్యే పుస్తకాలు లభించే ఏలూరు రోడ్డు, లెనిన్ సెంటర్, పటమటలోని షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. లాక్ డౌన్ కారణంగా పుస్తకాలు కొనేవారే కరవయ్యారని దుకాణదారులు చెప్పారు. గతేడాది ఇదే సీజన్​లో కోటిన్నర వ్యాపారం చేశామని.. ప్రస్తుతం లక్ష రూపాయల వ్యాపారం కూడా జరగలేదని అంటున్నారు.

  • వ్యాపారం లేక, నిర్వహణ ఖర్చులు భరించలేక

ఏటా మార్చి నుంచే అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో 2 నెలల ముందుగానే స్టాక్ తెప్పించి పెట్టుకుంటారు. అలా జనవరిలోనే తెప్పించి పెట్టిన స్టాక్ మొత్తం అలానే ఉండిపోయిందని పుస్తక దుకాణ యజమానులు వాపోతున్నారు. కనీసం 10శాతం కూడా అమ్ముడుపోలేదని విచారం వ్యక్తంచేశారు. మరోవైపు నిర్వహణ ఖర్చులు తప్పడంలేదంటున్నారు. దుకాణాల అద్దెలు, కరెంట్ బిల్లులు, సిబ్బంది జీతాల ఖర్చులు చెల్లించలేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు.

కరోనా ప్రభావంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచనల్లోనూ మార్పు వచ్చిందంటున్నారు. అత్యవసరం అనిపిస్తే తప్ప కొనుగోళ్లకు ముందుకు రావట్లేదని తెలిపారు. ఈ ఆలోచనా ధోరణీ తమ వ్యాపారాలను కుదేలు చేసిందంటున్నారు. ప్రభుత్వం ముందుకొచ్చి ఉదారంగా చేయూతనిస్తే తప్ప కోలుకోలేమని చెప్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలేవీ తమకు ఉపకరించేవి కాదని ఆవేదన వ్యక్తంచేశారు.

'నేను 32 సంవత్సరాలుగా పుస్తక దుకాణం నడుపుతున్నాను. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. గతేడాది ఇదే సీజన్​లో కోటిన్నర వ్యాపారం చేసిన నేను.. ప్రస్తుతం లక్ష రూపాయలు కూడా చేయలేదు. పిల్లలెవరూ బుక్స్ కొనేందుకు షాపుకు రావట్లేదు. లాక్ డౌన్ కారణంగా అవసరమైన పుస్తకాలు తెప్పించుకోవడం కష్టంగా మారింది.' -- మల్లికార్జునరావు, పుస్తక దుకాణ యజమాని

ఇవీ చదవండి...

యుద్ధానికి సై అన్న 'కొండచిలువ-నాగుపాము'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.