ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్ భారత్‌లోకి ప్రవేశించటంతో కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేపట్టింది. వైరస్ విస్తరించకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించటంతో ఒక్కసారిగా మాస్కులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వినియోగించే ఎన్ 95 మాస్కులకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఈ మాస్కుల ధర సాధారణ రోజుల్లో 90 రూపాయలు ఉండగా ఇప్పుడు ఇవి మూడింతలు పెరిగిపోయాయి. రెండు పొరల మాస్కు 3 రూపాయలు ఉండగా వీటి ధర వందశాతం పెరిగింది. గుడ్డ మాస్కులను వంద రూపాయలకు పైనే విక్రయిస్తున్నారు. వీటితోపాటు చేతులు శుభ్రం చేసుకునే లోషన్లు, గ్లౌజులకూ డిమాండ్ పెరిగింది.
వైరస్ నివారణకు వ్యక్తిగత శుభ్రతే ముఖ్యం
కరోనా వైరస్ వ్యాప్తి చెందుకుండా నిరోధించాలంటే వ్యక్తిగత శుభ్రతే ముఖ్యం. జలుబు, దగ్గు ఉన్న వారు తుంపర్లు ఎదుటవారిపై పడకుండా మాస్కులు వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మాస్కు తేమగా మారినప్పుడు వాడకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
మాస్క్‌ల కొరతకు ప్రభుత్వమే కారణం
రెండు నెలలుగా కరోనా హడలెత్తిస్తున్నా ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని తెలుగుదేశం నేత లోకేశ్ విమర్శించారు. మాస్కుల కొరతకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు.
ఇవీ చదవండి