ETV Bharat / city

తెలంగాణలో మరో 1831 కరోనా కేసులు

తెలంగాణలో సోమవారం కొత్తగా 1,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25 వేల 733కు చేరింది. వైరస్ కారణంగా.. 11మంది మృతి చెందగా... మొత్తం మృతుల సంఖ్య 306కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 10,646 మంది చికిత్స పొందుతున్నారు.

corona cases update in telangana
corona cases update in telangana
author img

By

Published : Jul 6, 2020, 11:47 PM IST

గ్రేటర్​లో ఏమాత్రం తగ్గని కరోనా

జీహెచ్​ఎంసీ పరిధిలో వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా 1,419 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 160, మేడ్చల్ 117, ఖమ్మం 21, మెదక్, మంచిర్యాల 20, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్​ అర్బన్, నిజామాబాద్​, పెద్దపల్లిలో 9 చొప్పున కేసులు వచ్చాయి. వికారాబాద్లో 7, సూర్యాపేట 6, కరీంనగర్​ 5, జగిత్యాల 4, సంగారెడ్డి 3 కేసులు నమోదయ్యాయి. గద్వాల, నారాయణపేట, యాదాద్రి, మహబూబాబాద్​లో ఒక్కో కేసు నమోదయ్యాయి.

ఆసుపత్రుల్లో పడకల వివరాలు వెల్లడి

తెలంగాణలో కరోనా చికిత్సకు ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేవన్న వార్తలపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ... పడకల వివరాలు సైతం వెల్లడించింది. గాంధీలో మొత్తం 1,890 పడకలు ఉండగా... 1,058 ఖాళీగా ఉన్నాయి, కింగ్ కోఠి ఆసుపత్రిలో 350 పడకలకు గానూ.. 239, చెస్ట్ ఆసుపత్రిలో 121 పడకలకు గానూ... 25, ఫీవర్ ఆసుపత్రిలో 140 పడకలు ఉండగా... 18 ఖాళీగా ఉన్నట్టు వివరించింది. హైద్రాబాద్​లో 2,501 పడకలకు గానూ... 1,340 ఖాళీగా ఉన్నాయని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.