ETV Bharat / city

తెలంగాణలో కరోనా వైరస్​ రికార్డ్.. కొత్తగా 730 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. కొత్తగా 730 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కొవిడ్​తో ఏడుగురు మృతి చెందారు.

corona cases increases rapidly in telangana deaths rate also more

author img

By

Published : Jun 21, 2020, 10:42 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఆదివారం 730 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 659 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 7802కు చేరింది. కొవిడ్​తో ఏడుగురు మరణించగా.. మెుత్తం మృతుల సంఖ్య 210కి చేరింది. కరోనా నుంచి కోలుకుని 225 మంది డిశ్ఛార్జి అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 3 వేల 731 మంది కోలుకున్నారు. ఆస్పత్రుల్లో 3,861 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 57,054 మందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి.

జనగామ జిల్లాలో కొత్తగా 34 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 10, మేడ్చల్‌ 9, వరంగల్‌-6, కుమురం భీం ఆసిఫాబాద్‌-3, వికారాబాద్‌ జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్​ వచ్చింది. సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మెదక్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు..ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.