ETV Bharat / city

కొత్తగా 15 కేసులు... అన్నీ విజయవాడలోనే - కృష్ణా జిల్లాలో కరోనా కేసులు

కృష్ణా జిల్లాలో కరోనా కేసులు తగ్గడం లేదు.. ప్రతి రోజు కేసులు వస్తూనే ఉన్నాయి. కొత్తగా మరో 15 మందికి పాజిటివ్‌ కేసులు నమోద్యాయి. అన్నీ విజయవాడ నగరంలోనే నమోదు కావడంతో కలవర పెడుతోంది. కృష్ణలంక ప్రాంతంలోనే 132 కేసులు నిర్ధారణ అయ్యాయి.

CORONA CASES IN KRISHNA DISTRICT
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు
author img

By

Published : May 19, 2020, 8:38 AM IST

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 382కు చేరింది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా మరో 15 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ విజయవాడలోనే ఉండడం ఆందోళనకర పరిణామం. నగరంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మే నెలలో కొత్తగా వచ్చిన కేసుల్లో 90శాతానికి పైగా నగరంలోనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కేసులు దాదాపుగా తగ్గిపోయాయి. కొత్తగా ఒకటీ అరా వస్తున్నా.. అవి నూజివీడు, పెనమలూరు, జగ్గయ్యపేట, గొల్లపూడి, ఆత్కూరు లాంటి కొన్నిచోట్లే వచ్చాయి. తాజాగా ఆ ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు తగ్గిపోయాయి. ప్రస్తుతం వస్తున్న కేసులన్నీ విజయవాడలోనే ఉంటున్నాయి.

కృష్ణా జిల్లాలోని 382 పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటివరకూ 263మంది ఆసుపత్రుల్లో చికిత్స పొంది కరోనాను జయించి ఇళ్లకు చేరుకున్నారు. వీరిలో పది మంది తాజాగా ఆదివారం రాత్రి డిశ్ఛార్జి అయ్యారు. వైరస్‌ బారినపడి 15మంది మృతి చెందారు. 104మంది జిల్లాలోని రెండు కోవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా విజయవాడలో వచ్చిన 15 కేసుల్లో కృష్ణలంకలోనే 11 ఉన్నాయి. దీంతో అక్కడ ఇప్పటివరకూ 132 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిగతా నలుగురిలో జక్కంపూడి వై.ఎస్‌.ఆర్‌.కాలనీకి చెందిన 14 ఏళ్ల బాలుడు, 18 ఏళ్ల యువతి ఉన్నారు. వన్‌టౌన్‌ కొత్తపేటకు చెందిన 60ఏళ్ల వృద్ధుడికి వైరస్‌ సోకింది. సూర్యారావుపేటలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే యువకుడికి పాజిటివ్‌ వచ్చింది.

మరింత అప్రమత్తంగా ఉండాలి..

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇప్పటివరకూ పోలీసులు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షల నడుమ కరోనా వైరస్‌ విస్తృతి తక్కువగా ఉంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పొడిగించినా ఆంక్షలను కొంతవరకూ సడలించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేటి నుంచి జన సంచారం ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కార్యాలయాలకు వెళ్లేవారు, దుకాణ సముదాయాలకు ఉదయం నుంచి రాత్రి వరకూ అనుమతి వంటివి ఇవ్వడంతో విచ్చలవిడిగా రోడ్లపైకి రావడం ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. యువత ప్రధానంగా అప్రమత్తమవ్వాల్సిన సమయం ఇది. స్వేచ్ఛ వచ్చిందని విచ్చలవిడిగా బయటకొస్తే.. వైరస్‌ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది. తిరిగి వారు ఇళ్లకు చేరాక.. పెద్దవారి ప్రాణాలకే ప్రమాదకరంగా ఇది పరిణమిస్తుంది. అందుకే.. అవసరం ఉంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు. ఒకవేళ దుకాణాలు, రైతుబజార్లు, మార్కెట్‌ల వద్దకు వచ్చినా.. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ను విధిగా ధరించడం చేయాలి. అప్పుడే వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. లేదంటే.. కుటుంబం మొత్తానికి ముప్పును తెచ్చినట్టే అవుతుందనేది గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కృష్ణలంకలో కలకలం

కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న కృష్ణలంక పరిధిలో సోమవారం మరో 11 మందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన నెలకొంది. రణదివేనగర్‌ కరకట్ట సాయిబాబా గుడి సమీపంలో ఒకే కుటుంబంలో నాలుగు, గౌతమీనగర్‌ మొదటి లైను, కల్పనా ప్రింట్‌ బజారుల్లో రెండేసి చొప్పున, గంగానమ్మగుడివీధి, కోతమిషన్‌ రోడ్డు, నిర్మల శిశుభవన్‌ పరిసరాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. కృష్ణలంక ఏపీఎస్సారెమ్‌ పాఠశాల ఆవరణలోని కేంద్రంలో సుమారు 200మందికి శ్వాబ్‌ టెస్టులు నిర్వహించారు.

*జిల్లాలో మొత్తం కేసులు 382
*మృతి చెందిన వారు 15
*డిశ్ఛార్జి అయిన వారు 263

*చికిత్స పొందుతున్న వారు 104

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.