AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 675 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 2,414 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 10,808 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 24,663 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. కొవిడ్ కారణంగా.. రాష్ట్రంలో ముగ్గురు మరణించారు.
- దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు
India Covid cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 30,615 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కొవిడ్ ధాటికి మరో 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 82,988 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. - మొత్తం కేసులు: 4,27,23,558
- మొత్తం మరణాలు: 5,09,872
- యాక్టివ్ కేసులు: 3,70,240
- మొత్తం కోలుకున్నవారు: 4,18,43,446
Covid Tests in India: దేశవ్యాప్తంగా మంగళవారం 12,51,677 కరోనా పరీక్షలు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 75,42,84,979కు చేరింది.
Vaccination in India: దేశంలో సోమవారం 41,54,476 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,73,86,81,675 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
World corona cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 19,00,985 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 41,57,78,024గా ఉండగా.. మరణాల సంఖ్య 58,55,707కు చేరింది.
- అమెరికాలో 94 వేల కొత్త కేసులు.. 2,202 మరణాలు నమోదయ్యాయి.
- జర్మనీలో ఒక్కరోజే 1.77 లక్షల మందికి పైగా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరో 214 మంది మృతిచెందారు.
- రష్యాలో మరో 1.66 లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. మరో 704 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో కొత్తగా 1.42 వేల మందికి పైగా కరోనా సోకింది. 390 మంది మరణించారు.
- టర్కీలో తాజాగా 94 వేల కేసులు బయటపడగా.. 309 మంది బలయ్యారు.
ఇదీ చదవండి:
రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలి- సీఎం జగన్