ETV Bharat / city

బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడండి.. గుత్తేదారుల ఆందోళన

విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద కాంట్రాక్టర్ల ఆ‘వేదన’ పేరుతో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు. చేసిన పనులకు రాష్ట్రప్రభుత్వం బిల్లులు చెల్లించని కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పలువురు మృతి చెందారని కాంట్రాక్టర్లు చెప్పారు. తమకు అలాంటి పరిస్థితి రానివ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. త్వరగా న్యాయం చేయాలని వేడుకున్నారు.

contracters protest in vijayawada
contracters protest in vijayawada
author img

By

Published : Oct 9, 2021, 6:49 AM IST

ఆంధ్రప్రదేశ్‌ బిల్డింగ్‌ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద కాంట్రాక్టర్ల ఆ‘వేదన’ పేరుతో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టారు. దాదాపు అన్ని జిల్లాల నుంచి 200 మందికిపైగా గుత్తేదారులు పాల్గొని వినూత్నరీతిలో నిరసన తెలిపారు. శిబిరంలో అర్ధనగ్నంగా మోకాళ్లపై నిల్చొని తొలుత భిక్షాటన చేశారు. అనంతరం ‘మేము ఉంటాం మీ వెంటే... మేము బతికి ఉంటే’, ‘బిల్లులు చెల్లించండి... ప్రాణాలు కాపాడండి’, ‘ఆస్తులు కరిగాయి... అప్పులు మిగిలాయి’, ‘నాడు పోషకులం.. నేడు యాచకులం’ వంటి నినాదాలతో ఉన్న ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు గుత్తేదారులు మాట్లాడారు. ‘బిల్లులు చెల్లించని కారణంగా మేం పనులు నిలిపి వేయడంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది ఉపాధి కోల్పోతున్నారు. వారందరికీ తిరిగి ఉపాధి కల్పించాలంటే పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి. పనుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక దివాలా తీస్తున్నాం. పుర, నగరపాలక సంస్థల్లో చిన్నాచితకా పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్న వారిపైనా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. పెండింగ్‌ బిల్లులు వడ్డీలతో కలిపి చెల్లిస్తే తప్ప బతికి బట్టకట్టే పరిస్థితి లేదు. పూర్తిచేసిన పనులకు బిల్లులు చెల్లించక కొత్త పనులకు టెండర్లు వేయలేకపోతున్నాం. ప్రభుత్వం న్యాయం చేయకపోతే కుటుంబాలతో రోడ్డున పడతాం’ అని పలువురు గుత్తేదారులు చెప్పారు.

గుత్తేదారుల ప్రధాన డిమాండ్లు ఇవీ..

* బిల్లులు చెల్లించని కారణంగా ఒత్తిడితో మరణించిన గుత్తేదారుల కుటుంబాలను ఆదుకోవాలి

* వివిధ ప్రభుత్వశాఖల్లో పెండింగ్‌ బిల్లులు తక్షణం చెల్లించాలి

* నిధులు, నిర్మాణ స్థలం, డ్రాయింగ్‌ అనుమతులు లేకుండా టెండర్లు పిలవకూడదు

* బడ్జెట్‌ కేటాయించని, ‘హెడ్‌ ఆఫ్‌ ఎకౌంట్‌’ లేని పనులపై తలెత్తిన సమస్యలు పరిష్కరించాలి

* ఇసుక అంచనా ధరకు, వాస్తవ ధరకు తేడాను గుర్తించి అదనంగా ఖర్చుచేసిన మొత్తాలను ప్రతి బిల్లుతో చెల్లించేలా జీవో ఇవ్వాలి

* బిల్లులు చెల్లించలేని పనులను రద్దుచేసి, అప్పటివరకు చేసిన పనులకు ఫైనల్‌ బిల్లుతోపాటు డిపాజిట్‌ తిరిగివ్వాలి

* కొవిడ్‌తో పాటు బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ముగింపు ఆలస్యమైన పనులకు ప్రైస్‌ ఎస్కలేషన్‌ చెల్లించాలి

* గుత్తేదారుల వేదనను తెలియజేసేందుకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలి.

‘రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పూర్తిచేసిన పనులకు పెండింగ్‌లో ఉన్న రూ.1,000 కోట్ల బిల్లులు తక్షణం చెల్లించాలి. గత మూడేళ్లుగా చెల్లింపుల్లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యధికులు ఇప్పటికే పనులు నిలిపివేశారు. పెట్టుబడులు లేక కొత్త పనులు చేయట్లేదు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఈ కార్యక్రమం నిర్వహించాం.’ - పీపీ రాజు, అధ్యక్షుడు, ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్ల సంఘం

‘ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలమందికి ఉపాధి కల్పిస్తున్న గుత్తేదారుల వ్యవస్థను ప్రభుత్వం కాపాడాలి. ఉమ్మడి రాష్ట్రంలోనూ గతంలో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుత్తేదారుల వ్యవస్థను కాపాడేందుకు 2009లో జీవో 35 జారీచేశారు. దీన్ని కచ్చితంగా అమలుచేసేలా ప్రస్తుత సీఎం చొరవ తీసుకోవాలి.’- ఎస్‌.విజయ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి, ఏపీ బిల్డింగ్‌ కాంట్రాక్టర్ల సంఘం

‘పద్మావతి విశ్వవిద్యాలయంలో రుసాతో పాటు రాష్ట్రప్రభుత్వ నిధులతో భవన నిర్మాణాల పనులు రూ.60 కోట్లతో రెండేళ్ల క్రితం ప్రారంభించాం. రూ.30 కోట్ల పనులు పూర్తయ్యాయి. గత 18 నెలలుగా బిల్లుల చెల్లింపులు నిలిపివేశారు. పూర్తిచేసిన పనులకు రూ.8 కోట్లు రావలసి ఉంది. నాలుగు నెలల క్రితం పనులు నిలిపివేశాం’- పి.మురళీమోహన్‌రెడ్డి, గుత్తేదారు, తిరుపతి

‘బిల్లులు సకాలంలో చెల్లించని కారణంగా బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదు. ఓవర్‌ డ్రాఫ్టు (ఓడీ) సౌకర్యం కల్పించినా మూడు నెలల్లో తిరిగి వడ్డీ చెల్లించలేని పరిస్థితి. నగరపాలక సంస్థల్లో 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక, సాధారణ నిధులతో చేసిన పనులకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్తగా పనులు చేయలేకపోతున్నాం’- జి.శరత్‌రెడ్డి, ఏలూరు

ఇదీ చదవండి: HIGH COURT: సెంటు స్థలంలో ఇల్లు ఎలా సాధ్యం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.