ETV Bharat / city

మంత్రుల ఇళ్లు ముట్టడి... ఎక్కడికక్కడ కట్టడి

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కార్మిక సంఘాలు మంత్రుల ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. కార్మికుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్తత నెలకొంది. కార్మికులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు.

మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం
మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం
author img

By

Published : Nov 17, 2020, 9:58 PM IST

మంత్రుల ఇళ్ల ముట్టడి భగ్నం

భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పథకాలను కొనసాగించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, మంత్రుల ఇళ్ల ముట్టడి కార్యక్రమాలు జరిగాయి. కార్మికులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఇచ్చినట్టు చెబుతున్న ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడికి యత్నించిన కార్మిక సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు నివాసం ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసి... కార్మికులను అరెస్టు చేశారు.

అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. కడప జిల్లాలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా క్యాంపు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. కార్మికుల సమస్యలను విన్న అంజద్‌ బాషా... వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. పుత్తూరులో ర్యాలీ నిర్వహించిన కార్మికులు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి వినతి పత్రాన్ని అందజేశారు.

తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించడానికి భవన నిర్మాణ కార్మికులు, కార్మిక సంఘాల నేతలు చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. కార్మికులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఇదీ చదవండి:

తొలుత ఈడీ కేసులు విచారణ వద్దు.. జగన్​ అక్రమాస్తుల కేసులో వాదనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.