విరసం నేత వరవరరావు వయసు, ఆరోగ్యం పరిగణలోకి తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. బెయిల్ ఇవ్వాలని వరవరరావు భార్య వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఎన్‌ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. మనమంతా మనుషులమన్న విషయం మరిచిపోకూడదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రస్తుతం ముంబయి నానావతి ఆస్పత్రిలో వరవరరావు చికిత్సపొందుతున్నారు. చికిత్స ఖర్చులు తామే భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టు అయిన వరవరరావు అనారోగ్యం భారినపడ్డారు.
ఇదీ చదవండి : చిన్నారి వైద్యానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య సాయం