ETV Bharat / city

స్వాతంత్య్ర సమరంలో భాజపా పాత్ర లేదు: కాంగ్రెస్​ నేతలు - ప్రధాని పై కాంగ్రెస్ వ్యాఖ్యలు​

జాతీయ జెండాను రూపకల్పనకు వందేళ్లు పూర్తవడాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్​ పార్టీ నేతలు విజయవాడలో వేడుకలు నిర్వహించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో భాజపా పాత్ర లేదంటూ ప్రధానిపై నేతలు వ్యాఖ్యలు చేశారు.

congress celebrations at vijayawada
స్వాతంత్య్ర సమరంలో భాజపా పాత్ర లేదన్న కాంగ్రెస్​ నేతలు
author img

By

Published : Apr 2, 2021, 9:39 AM IST

జాతీయ జెండాను రూపొందించి వందేళ్లు పూర్తైన సందర్భంగా విజయవాడ జింఖాన గ్రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు డాక్టరు శైలజానాథ్, మాజీ ఎంపీలు హర్ష కుమార్, వి.హనుమంతరావు, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జాతీయజెండా విలువను ప్రధాని తెలుసుకోవాలని వి.హనుమంతరావు అన్నారు. జాతీయ జెండా రూపకర్తను గుర్తించడానికి ప్రధానికి సమయం లేదా అంటూ నిలదీశారు. దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన చరిత్ర ఉత్తరాది వాళ్లది మాత్రమే కాదని, దక్షిణాది రాష్ట్రాల్లో పోరాడిన వారు అనేక మంది ఉన్నారని అన్నారు.

జాతీయజెండా రూపకర్తను ప్రధాని మర్చిపోయారని మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించారు. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన ప్రజల రాతను మార్చేసిందని, దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. విభజించి పాలించే సిద్ధాంతాన్ని భాజపా అనుసరిస్తోందని ఆరోపించారు. దక్షిణాదిపై భాజపా వివక్ష చూపిస్తోందన్నారు. రాష్ట్రానికి హోదా ఇస్తామని మోసం చేసి ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసరికి మిగిలిన రాష్ట్రాలకు హోదా ఇస్తామని ప్రకటనలు ఇస్తున్నారన్నారు.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాజపా పాత్ర ఎక్కడ ఉందని పీసీసీ అధ్యక్షుడు డాక్టరు శైలజానాథ్ ప్రశ్నించారు. ప్రధాని అసత్యాలు వల్లిస్తున్నారని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భాజపా పాత్రపై చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ విసిరారు. దేశం, దేశభక్తి అంటూ దేశంలో ఉన్న ఆస్తులను అమ్మే ప్రక్రియకు ప్రధాని శ్రీకారం చుట్టారన్నారు.

ఇదీ చదవండి: గుడ్​ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.