కృష్ణా జిల్లాలో ఆర్ఎంపీలు, పీయంపీలు కొవిడ్ వైద్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. ఎపిడిమిక్ డిసీస్ యాక్ట్ ప్రకారం ఆర్ఎంపీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కొవిడ్ సంబంధిత లక్షణాలు.. బ్రాంకీయల్ అస్మా, ఎల్వీఎఫ్, ఏఆర్డీ. ఎక్యూట్మమో కార్డియల్ ఇన్ఫెక్షన్, వంటి తదితర లక్షణాలుంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స అందించాలన్నారు.
కావున పైన పేర్కొన్న కేసులకు సంబంధించి ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యం చేయకుండా.. గుర్తింపు పొందిన కొవిడ్ ఆస్పత్రికి పంపించాలన్నారు. అలా కాకుండా కొవిడ్ చికిత్సకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.