శుభ కార్యాలయాలకు వెళ్లే ప్రతీ 200 మందిలో 40 మందికి కరోనా వైరస్ సోకుతోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. జగ్యయ్యపేట, నమలూరు, కంకిపాడు, విజయవాడ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. ఆ హాట్ స్పాట్లో కరోనా వ్యాప్తి కట్టడికి జాగ్రత్తలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పెరుగుతున్న కొవిడ్ కేసులకు అనుగుణంగా వైరస్ నిర్ధరణ పరీక్షల నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కరోనా బాధితులనకు చికిత్స అందించేందుకు తాజాగా 7 ఆస్పత్రులకు అనుమతినిచ్చినట్లు తెలిపారు. జిల్లాలో అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు, సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటి తీవ్రత తక్కువగానే ఉందని.. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: