కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్‌కు చెందిన తిరుపతి అనారోగ్యంతో గత నెల 18న హఠాత్తుగా చనిపోయాడు. రెక్కల కష్టం మీద జీవనం సాగించే... ఆ కుటుంబానికి ఉండటానికి ఇల్లు లేదు. అద్దెకు కూడా ఇల్లు లభించకపోవడం వల్ల నిర్మాణంలో ఉన్న భవనంలో తలదాచుకుంటున్నారు. ప్రహరీ గోడ లేని భవనంలో వృద్ధులు, పిల్లలు చలికి వణికుతున్నారు. అప్పుచేసి ఇల్లు కడుతుండగా... తిరుపతి చనిపోవడంతో నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది.
వీరి ధీనగాథపై ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం, కన్నీళ్ల మంటతో చలికాచుకుంటున్న కుటుంబం... అర్థిస్తోంది దాతల సాయం కథనాలను ఈటీవీ భారత్ ప్రసారం చేసింది. ఈటీవీ భారత్ కథనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ స్పందించారు. ఆ పేద కుటుంబానికి రూ.లక్ష సాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక నేతలు మరో రూ.2 లక్షలు ప్రకటించారు. అంతేకాకుండా వారికి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: ఇంటి పెద్ద అకాల మరణం... చేసింది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం
కన్నీళ్ల మంటతో చలికాచుకుంటున్న కుటుంబం... అర్థిస్తోంది దాతల సాయం