ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ కలవనున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సహా నేతలపై వైకాపా శ్రేణుల దాడుల గురించి రాష్ట్రపతికి ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోందంటూ ఆర్టికల్-356 ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు సహా ఇతర అంశాలపై గవర్నర్‌కు సీఎం వివరణ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై అభిమానులు దాడులకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం. తెలుగుదేశం నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల సీడీలు, తగిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో శాసనసభ సమావేశాల నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. వీటిపైనా గవర్నర్‌తో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ప్రస్తావించే అవకాశాలున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడిన అమిత్ షా