ముఖ్యమంత్రి జగన్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవనామ సంవత్సరంలో ఇంటింటా సిరులు, ఆనందాలు నిండాలని ఆకాక్షించారు. ఈ ఏడాది కూడా సమృద్ధిగా వానలు కురవాలని భగవంతుడిని ప్రార్థించారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాలు సుభిక్షంగా ఉండాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో ప్రతి ఇల్లూ సంతోషంతో కళకళలాడాలని అభిలాషించారు. మొత్తం ప్రపంచానికి కరోనా పీడ శాశ్వతంగా తొలగిపోవాలని కోరుకున్నారు.
ఇదీచదవండి
మహారాష్ట్ర తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో.. తెలుగోడి పాట