ETV Bharat / city

CM Jagan: క్లియర్ టైటిల్​తో రిజిస్ట్రేషన్.. ఈనెల 20 నుంచి ప్రారంభం: సీఎం జగన్ - jagananna sampurna gruha hakku scheme news

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం (jagananna sampurna gruha hakku scheme) కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నవంబరు 20 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ (Registration with clear title) చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ (CM jagan) స్పష్టం చేశారు. డిసెంబరు 15 వరకు ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కొనసాగించాలని.., రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

క్లియర్ టైటిల్​తో రిజిస్ట్రేషన్
క్లియర్ టైటిల్​తో రిజిస్ట్రేషన్
author img

By

Published : Nov 11, 2021, 7:05 PM IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై (jagananna sampurna gruha hakku scheme) ముఖ్యమంత్రి జగన్ (CM jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ (CS) డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో లబ్ధిదారుల గుర్తింపుపై సమీక్షలో చర్చించారు. ఇప్పటివరకూ 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్‌ చేసినట్లు వెల్లడించారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్‌ (Aprovels) ఇస్తున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్‌ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ (Registration with clear title) చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు (Enquiry) కూడా నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని..,ఈ విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పథకం అమలుపై దిగువ స్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌. జాప్యం లేకుండా దరఖాస్తులు అప్రూవల్‌ చేయాలి. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలి. ఆస్తులపై హక్కులు దఖలు పడతాయని అవగాహన కల్పించాలి. పథకం అమలుపై అధికారులు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పాటించాలి. ఈనెల 20 నుంచి డిసెంబరు 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేయాలి. -జగన్, ముఖ్యమంత్రి

రిజిస్ట్రేషన్ల కోసం తగినన్ని స్టాంపు పేపర్లను (Stamp papers) తెప్పించుకున్నామన్న అధికారులు..10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు నవంబరు 20 నుంచి రిజిస్ట్రేషన్‌ (Registration) ప్రారంభించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబరు 15 వరకూ రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలన్నారు.

ఇదీ చదవండి

CM Review on Rains: కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి..అవసరమైన చోట శిబిరాలు: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.